Header Banner

తిరుమల భక్తులకు అలర్ట్.. ఇక ఆ టికెట్‌ ఉంటేనే.! వసతి గదుల కేటాయింపులో మార్పులు.. కొత్త రూల్ ఇదే!

  Sun Mar 02, 2025 20:07        Devotional

తిరుమల కొండపై వీఐపీలకు వసతి గదుల కేటాయింపు విధానంలో టీటీడీ కొత్త రూల్ తీసుకువచ్చింది. ఇకపై వీఐపీలు దర్శన టికెట్ తీసుకుని వస్తేనే వారికి తిరుమలలో వసతి గదులు కేటాయించనున్నారు. టీటీడీ ఈ నిర్ణయం తీసుకోవడానికి గట్టి కారణమే ఉంది. తిరుమల కొండపైకి వచ్చే యాత్రికులకు వసతి కల్పించేందుకు టీటీడీ 7,500 గదులను అందుబాటులో ఉంచింది. వీటిలో 3,500 గదులను సామాన్య భక్తులకు కేటాయిస్తారు. అడ్వాన్స్ బుకింగ్ కింద 1,580 గదులు, టీటీడీకి విరాళాలు ఇచ్చే భక్తులకోసం 400 గదులు, ఆన్ అరైవల్ కింద మరో 450 గదులు కేటాయిస్తున్నారు. మిగిలిన గదులను కరెంట్ బుకింగ్ విధానంలో వీఐపీల కోసం కేటాయిస్తున్నారు. 

 

ఇది కూడా చదవండి: కిషన్ రెడ్డితో కలిసి కేంద్రమంత్రి ప్రెస్ మీట్! చంద్రబాబు సూచన మేరకే నడుచుకుంటున్నా!

 

అయితే, వీఐపీలకు కేటాయించే ఈ గదులను దళారీలు ఆధార్ కార్డుల ద్వారా పొంది, వారి అధీనంలో ఉంచుకునేవారు. ఈ గదులను రెండ్రోజుల పాటు ఉపయోగించుకునే వీలుండడంతో... రోజుకు ఒక భక్తుడికి చొప్పున, లేకపోతే ఇద్దరు ముగ్గురు భక్తులకు కలిపి ఈ గదులను అద్దెకు ఇస్తూ దళారీలు పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నారు. దాంతో దళారీ వ్యవస్థకు చెక్ పెట్టేందుకు టీటీడీ తాజా నిబంధన తీసుకువచ్చింది. ఇకపై దర్శన టికెట్ ఉన్న వీఐపీ వస్తేనే ఈ గదులు కేటాయిస్తారు. పద్మావతి విచారణ కేంద్రం, ఎంబీసీ, టీబీ కౌంటర్లలో ఆధార్ కార్డు, దర్శన టికెట్ ను చూపించి వీఐపీలు ఈ గదులు పొందాల్సి ఉంటుంది. ఈ విధానం ఎంతో మెరుగైన ఫలితాలు ఇస్తోందని టీటీడీ వర్గాలు చెబుతున్నాయి.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల భర్తీకి డెడ్‌లైన్.. పార్టీ నిర్మాణంపై కీలక ఆదేశాలు! చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

దారుణం హత్య.. హల్చల్ చేస్తున్న న్యూస్.. సూట్‌కేసులో కాంగ్రెస్ మహిళా కార్యకర్త మృతదేహం!

 

విద్యార్థులకు లోకేష్ శుభవార్త! లీప్ అమలుపై సమీక్ష.. ఏపీలో ప్రతి నియోజకవర్గంలో..

 

కూటమిలో అంతర్యుద్ధం వచ్చిందని వైసీపీ మాజీ ఎంపీ! హోంమంత్రి అనిత రివర్స్ పంచ్!

 

ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈరోజు నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్.! తేడా వస్తే భారీ జరిమానాలు..లిస్ట్ ఇదిగో!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #TTD #VIP #NewRule #Cottages #Tirumala